కొబ్బరి కాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకోండి: కేంద్ర మంత్రి సలహా

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ వివాదంలో ఇరుక్కున్నారు. రాజస్థాన్ లోని జోధ్పూర్ లోని ఒక ఆసుపత్రిని సందర్శించిన ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. అక్కడ ఆయన ఒక కోవిడ్ రోగి కుటుంబానికి ఇచ్చిన ధైర్యమే వివాదాస్పదం అయింది. “మీరు బాలాజీకి కొబ్బరికాయను అర్పిస్తే, అంతా బాగానే ఉంటుంది” అని వ్యాఖ్యలు చేసారు. గజేంద్ర సింగ్ షెఖవత్ జోధ్పూర్ లోని ఎయిమ్స్, ఎండిఎం, ఎంజిహెచ్ ఆసుపత్రులను సందర్శించి రాజస్థాన్ లో కరోనా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మధురాదాస్ మాథుర్ ఆసుపత్రిని సందర్శిస్తున్న సమయంలో ఒక యువకుడు వచ్చి డాక్టర్ ను పంపి తన తల్లిని రక్షించమని కోరాడు. వెంటనే స్పందించిన మంత్రి ఒక అధికారికి ఆ విషయం చెప్పే లోపే తల్లి కన్ను మూసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే, ఏడుస్తున్న ఇద్దరు మహిళలను షేఖావత్ కలిసి దేవుడికి దండం పెట్టుకోవాలని, కొబ్బరి కాయ కొడితే అంతా మంచే జరుగుతుందని చెప్పడంతో వివాదం రేగింది.