IRCTC నుండి 11 రోజులు ఉత్తర భారతదేశ యాత్ర… వివరాలు మీకోసం..!

-

IRCTC తాజాగా మరో టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులకు ఇది నిజంగా శుభవార్తే. ఇక ఈ టూర్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… రూ.10 వేలకే 11 రోజులు ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లొచ్చు. ‘ఉత్తర భారత యాత్ర విత్ మాతా వైష్ణో దేవి’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ ఇస్తోంది.

11 రోజులు, 10 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. ఆగ్రా, మథుర, వైష్ణో దేవి, అమృత్‌సర్, హరిద్వార్, ఢిల్లీ లాంటి ప్రాంతాలను చుట్టేయచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 24న టూర్ ప్రారంభం మే 4న ముగుస్తుంది.

ఈ టూర్ కి వెళ్లాలనుకుంటే రేణుగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, పెద్దపల్లి, కాజిపేట్, రామగుండంలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,400. ఇది స్టాండర్డ్ ధర. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.17,330 .

ఇక టూర్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మొదటి రోజు రైలు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, పెద్దపల్లి, కాజిపేట్, రామగుండం రైల్వే స్టేషన్ల లో ఆగుతూ వెళ్తుంది. ఇలా ఏప్రిల్ 25న రెండో రోజు రైలు ఆగ్రాకు చేరుకుంటుంది. ఆగ్రాలో రాత్రి స్టే చెయ్యాలి.

మూడో రోజు ఆగ్రాలో తాజ్‌మహల్, ఆగ్రా ఫోర్ట్ చూసాక మధుర వెళ్ళాలి. కృష్ణ జన్మభూమి చూసాక నాలుగో రోజు సాయంత్రానికి పర్యాటకులు కాట్రా చేరుకుంటారు. ఐదో రోజు మాతా వైష్ణో దేవి ఆలయాన్ని చూసి,  ఆరో రోజు కాట్రా నుంచి స్టార్ట్ అయ్యి… జలంధర్ చేరుకుంటారు.

రోడ్డు మార్గంలో అమృత్‌సర్ బయల్దేరాలి. గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్ చూసి తిరిగి జలంధర్ వెళ్ళాక ట్రైన్ జర్నీ మొదలవుతుంది. ఏడవ రోజు హరిద్వార్ రీచ్ అవుతారు. అక్కడ గంగా నది లో స్నానం చేయొచ్చు. ఆ తర్వాత మానస దేవీ మంది ఆలయాన్ని చూసాక గంగా హారతి చూసి హరిద్వార్ నుంచి బయల్దేరాలి.

ఇక ఎనిమిదో రోజు ఢిల్లీ సఫ్దర్ గంజ్ చేరుకుంటారు. అక్కడ ఎర్రకోట, రాజ్ ఘాట్, ఇందిరా మెమొరియల్, అక్షర్‌ధామ్ ఆలయాన్ని చూసి… మే 2న తొమ్మిదో రోజు ఢిల్లీలో కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఇండియా గేట్ చూసి పదో రోజు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news