టీడీపీ నేత కూన రవి మీద వైసీపీ దాడి.. సిక్కోలులో తీవ్ర ఉద్రిక్తత !

Join Our Community
follow manalokam on social media

శ్రీకాకుళం పొందూరు మండలం పెనుబర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.  టిడిపి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ కూన రవికుమార్ వాహనం మీద వైసీపీ దాడి చేసినట్లు సమాచారం. దాడి నుంచి తప్పించుకుని కూన రవి ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఇళ్ళమీద కూన రవికుమార్ అనుచరులు దాడి చేసినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

గ్రామంలో రెండు వందల మంది పోలీసులు పహారా కాస్తున్నట్లు సమాచారం. బయటి వ్యక్తులు ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో సొంత మేనమామ అయిన తమ్మినేని సీతారాం మీద పోటీ చేసిన కూన రవి కుమార్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక తమ్మినేని సీతారాం కి అత్యుత్తమ స్పీకర్ పదవి ఇచ్చి జగన్ సత్కరించారు. అయినా సరే కూన రవి కుమార్ ఎక్కడ తగ్గకుండా సొంత మేనమామ అయినా సరే ఆయన మీద విమర్శలు గుప్పిస్తూ రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు.

 

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...