ట్రావెల్ : ఆంధ్ర శబరిమల ఆలయాన్ని, జలపాతాలని చూడాల్సిందే..!

-

ఆంధ్ర శబరిమల ఆలయం తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి గ్రామానికి సమీపం లో ఉంది.
అన్నవరం దేవస్థానం నుండి 25 కిలోమీటర్లు దూరం లో ఆంధ్ర శబరిమల ఆలయం ఉంది.
ఈ ఆలయాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సందర్శించవచ్చు. ఇక్కడా నిత్యం అయ్యప్ప స్వామి ఇరుముడిలు స్వీకరించుతారు. అంతే కాదు మకర సంక్రాంతి రోజు నాడు జ్యోతి దర్శనం కూడా చేసుకోవచ్చు.

ఈ ఆలయ ప్రాంగణం లో అయ్యప్ప స్వామి తో పాటు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. కేరళలోని శబరిమల వద్ద ఉండే అయ్యప్ప స్వామి ప్రతి రూపాన్ని ఇక్కడ కూడా నిర్మించాలి అనే సంకల్పంతో ఆలయాన్ని పూర్తి చేశారు. కేరళలోని శబరిమల ఆలయం వద్ద సౌకర్యాలు లేకపోవడం మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలగాలని వచ్చిన ఈ ఆలోచనే ఆలయ నిర్మాణానికి దారి తీసింది.

ఆంధ్ర శబరిమల ఆలయ ప్రాంగణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఎంతో అందమైన జలపాతం కూడా ఉంది. ఎందరో పర్యాటకులు ఆలయం దర్శనం చేసుకొని ఆ జలపాతాల వద్దసమయాన్ని గడుపుతారు. ఈ ప్రదేశమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతిని ఇష్టపడే వారు ఈ ఆలయ ప్రాంగణ వాతావరణాన్ని ఎంత గానో ఇష్టపడతారు. ఆలయ ప్రాంగణం చుట్టూ మొక్కలు, కొండలు ఉండడం వలన చాలా నిశ్శబ్దకరమైన వాతావరణం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news