అతిరాపల్లి వాటర్‌ఫాల్.. బాహుబలి షూటింగ్ ఇక్కడే.. కేరళలోనే అద్భుతమైన వాటర్‌ఫాల్..!

1350

ఈ వాటర్ ఫాల్‌ను సందర్శించడానికి సరైన సమయం జూన్ నుంచి అక్టోబర్. ఆ నెలల్లో అక్కడ వాతావరణం చల్లగా ఉండటంతో పాటు సెలయేరు కూడా జోరుగా ప్రవహిస్తుంటుంది. ఈ వాటర్ ఫాల్‌తో పాటు పక్కనే ఉన్న బర్డ్ వాచర్స్, ట్రెక్కర్స్, నేచర్ లవర్స్, ఫోటో ఫనటిక్స్ లాంటి ప్రదేశాలను చూడొచ్చు.

మీరు బాహుబలి సిరీస్ చూశారా? అయితే.. ఖచ్చితంగా మీరు అతిరాపల్లి వాటర్ ఫాల్ గురించి ఐడియా ఉండి ఉంటుంది. బాహుబలి బిగినింగ్ సిరీస్‌లో తమన్నా కోసం వాటర్ ఫాల్ అంతా తిరుగుతుంటాడు కదా శివుడు. అదే మన మహేంద్ర బాహుబలి. శివుడి లింగాన్ని కూడా ఎత్తుకెళ్లి సెలయేరు దగ్గర పెడతాడు కదా. ఆ షూటింగ్ అంతా తీసింది అతిరాపల్లి వాటర్ ఫాల్ దగ్గరే. అది కేరళలో ఉంది.

Athirappilly Falls, Must visit water fall in kerala

త్రిశూర్ జిల్లాలో ఉంది ఈ వాటర్ ఫాల్. త్రిశూర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొచ్చిన్ నుంచి అయితే 70 కిమీల దూరంలో ఉంటుంది. చలకుడి అనే నది మీద ఈ జలపాతం ఉంటుంది. 80 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతున్న సెలయేర్లను చూసి మైమరిచిపోవాల్సిందే. అతిరాపల్లి వాటర్ ఫాల్‌నే ఇండియా నయగారా ఫాల్స్ అని కూడా పిలుస్తారు. కేరళలోనే అత్యంత పెద్ద వాటర్ ఫాల్ అది.

Athirappilly Falls, Must visit water fall in kerala

ఒకవేళ విమానం ద్వారా రావాలనుకుంటే.. కొచ్చిన్ వరకు విమానంలో వచ్చి అక్కడి నుంచి ఈ వాటర్ ఫాల్‌కు చేరుకోవచ్చు. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ నెదుంబస్సెరీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Athirappilly Falls, Must visit water fall in kerala

ట్రెయిన్‌లో వస్తే చలకుడి, అంగమలై అనే రైల్వేస్టేషన్ల వద్ద దిగొచ్చు. పెద్ద స్టేషన్లు అలువా, ఎర్నాకులంలోనూ దిగి ఆ వాటర్ ఫాల్‌కు చేరుకోవచ్చు.

ఈ వాటర్ ఫాల్‌ను సందర్శించడానికి సరైన సమయం జూన్ నుంచి అక్టోబర్. ఆ నెలల్లో అక్కడ వాతావరణం చల్లగా ఉండటంతో పాటు సెలయేరు కూడా జోరుగా ప్రవహిస్తుంటుంది. ఈ వాటర్ ఫాల్‌తో పాటు పక్కనే ఉన్న బర్డ్ వాచర్స్, ట్రెక్కర్స్, నేచర్ లవర్స్, ఫోటో ఫనటిక్స్ లాంటి ప్రదేశాలను చూడొచ్చు. అతిరాపల్లి నుంచి ఓ 5 కిలోమీటర్లు వెళితే వాజాచల్ వాటర్ ఫాల్స్ వస్తాయి. అది కూడా ప్రకృతికి నిలువెత్తు నిదర్శనం. సో.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అతిరాపల్లి వాటర్ ఫాల్ ట్రిప్‌కు ప్లాన్ వేసుకోండి. కేరళకు కేరళ చూసినట్టుంటది.. ప్రకృతి అందాల్లో మైమరిచిపోవచ్చు.. అద్భుతమైన అతిరాపల్లి వాటర్ ఫాల్‌ను కూడా చూసేయొచ్చు.

Athirappilly Falls, Must visit water fall in kerala

Athirappilly Falls, Must visit water fall in kerala