చాలా మందికి వివిధ ప్రాంతాలను సందర్శించడం అంటే ఇష్టం. మీకు కూడా కొత్త ప్రదేశాలు చూడడం ఇష్టమా…? కానీ ఎక్కువ ఖర్చు అయి పోతుందేమోనని వెళ్లడం లేదా..? అయితే ఈ రోజు మీకోసం భారతదేశంలో ఉన్న పది ప్రదేశాలు గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడికి వెళ్లాలంటే మీకు ఐదు వేల రూపాయల కంటే తక్కువ అవుతుంది. మరి ఆ ప్రదేశాల గురించి ఇప్పుడే చూసేయండి.
రిషికేశ్:
రిషికేశ్ తప్పక చూడాల్సిన ప్రదేశం. గంగా నది లో రివర్ రాఫ్టింగ్ చాలా బాగుంటుంది. ఢిల్లీకి ఇది కేవలం 229 కిలోమీటర్ల దూరం మాత్రమే. బస్సు సదుపాయం కూడా సులువుగానే ఉంటుంది.
కసౌలీ:
హిల్ స్టేషన్ లో గడపాలంటే కసౌలి బెస్ట్ ప్లేస్. ఢిల్లీ నుంచి సులువుగా రైలులో వెళ్లొచ్చు. ఐదు వేల రూపాయల కంటే తక్కువ ఖర్చుతో మీరు ఈ ప్రదేశాన్ని చూడొచ్చు.
లాన్స్డౌన్:
ఇది చాలా చిన్నగా ఉంటుంది మరియు చాలా అందమైన హిల్ స్టేషన్. ఇది ఢిల్లీకి కేవలం 250 కిలో మీటర్ల దూరంలో ఉంది.
బృందావన్:
ఈ ప్రదేశాన్ని కూడా తప్పక చూడాలి. పైగా తక్కువ ఖర్చులో వెళ్ళిపోవచ్చు. ఆధ్యాత్మికతతో ఈ ప్రదేశమంతా నిండి ఉంటుంది. ఫోటోలు తీసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది.
బిన్సర్:
ఢిల్లీకి బిన్సర్ కేవలం 9 గంటలలో చేరుకోవచ్చు. ఈ ప్రదేశం చాలా ఫేమస్. ఇక్కడ అందమైన పక్షులు కూడా ఉంటాయి.
కసోల్:
చాలా ఫేమస్ ఈ ప్రదేశం. పైగా చాలా అందంగా ఉంటుంది. టూరిస్టులుని ఇది బాగా ఆకర్షిస్తుంది.
కన్యా కుమారి:
కన్యాకుమారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ సూర్యోదయాన్ని చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వెళుతూ ఉంటారు. ఇది త్రివేండ్రం నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వారణాసి:
వారణాసి చూడడానికి పొరుగు దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అక్కడ గంగా నది, దేవాలయాలు ఇలా చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి.
మెక్లెఒద్ గంజ్:
ఢిల్లీ కి దగ్గరలో ఉండే వాళ్ళు ఈ ప్రదేశం తప్పక చూడండి. చూడడానికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది.
హంపి:
రోజు రోజుకి హంపీని చూడడానికి టూరిస్టులు ఎక్కువ మంది వస్తున్నారు. నిజంగా ఈ ప్రదేశాన్ని కూడా తప్పక చూడాలి. హంపీని చూడడానికి చాలా బాగుంటుంది కనుక సమయం దొరికితే తప్పకుండా విజయం వీక్షించండి.