ప్రపంచంలో అత్యంత ఆనందకర దేశాలేంటో తెలుసా? భారతదేశ స్థానం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

-

జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని చెబుతారు. కానీ, ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు. ఆనందంగా ఉండడానికి వారుంటున్న ప్రదేశాలు ఎంతవరకు సపోర్టు చేస్తున్నాయి? ఈ ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉండే ప్రాంతాలు ఏవి? ఏయే దేశాల ప్రజలు అందరికంటే ఆనందంగా ఉంటున్నారు? ఆనందంగా జీవించడంలో భారతదేశ స్థానం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిన్ లాండ్

ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉండే దేశాల్లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం, భద్రత మొదలగునవన్నీ ఫిన్లాండ్ లో ప్రజలు అనుభవిస్తున్నారు.

డెన్మార్క్

ప్రపంచంలోని అన్ని దేశాల వారం మొత్తం పనిగంటల్లో అతి తక్కువ పనిగంటలు కలిగిన దేశం ఇదే. కేవలం 33గంటల పనిగంటలు మాత్రమే అక్కడ పనిచేయాలి. వర్క్ లైఫ్ బ్యాలన్స్ మెయింటైన్ చేయడంలో డెన్మార్క్ చూపుతున్న నిబద్ధత కారణంగా ప్రపంచంలోని అత్యంత ఆనందకర దేశాల్లో స్థానంలో నిలిచింది.

స్విట్జర్ లాండ్

స్విట్జర్ లాండ్ ప్రజల మధ్య సంబంధాలు వారిని సంతోషంగా ఉంచుతున్నాయి. ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, అనురాగం వారి జీవితాలను సంతోషంగా మారుస్తున్నాయి.

ఐస్ లాండ్

కొన్ని తరాల నుండి అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటున్నారు. వర్క్ లైఫ్ బ్యాలన్స్ తో పాటు అక్కడ ఉండే సుందర ప్రకృతి దృశ్యాలు వారిలో ఆనందాన్ని పెంచుతున్నాయి.

నెదర్లాండ్

సంతోష్ సూచీలో వేగంగా ఎదుగుతూ ఎంతో అభివృద్ధి అందుకున్న దేశం నెదర్లాండ్. 2005నుండి 2020వరకు సంతోష సూచీలో ఎగబాకుతూనే ఉంది.

నార్వే

సూర్యుడు అస్తమించని దేశంగా చెప్పుకునే ఈ ప్రదేశంలో అక్కడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఆనందంగా ఉంచుతున్నాయి.

స్వీడన్

వర్క్ లైఫ్ బ్యాలన్స్, సమానత్వం, తలసరి ఆదాయం ఎక్కువగా ఉండడం మొదలగునవన్నీ స్వీడన్ ని సంతోషకర దేశాల్లో ఉండేలా చేసింది.

ఇక సంతోష సూచీలో భారతదేశం ర్యాంకు గురించి తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. 139వ ర్యాంకుతో భారత్ నిలిచింది. అంటే ఇక్కడ ప్రజలు ఎంత ఆనందంగా ఉంటున్నారనేది అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news