వాహ్.. కేరళ టూర్.. ఎంచక్కా ఈ ప్రదేశాలకి వెళ్లి వచ్చేయచ్చు..!

-

ఐఆర్‌సీటీసీ టూరిజం ఎన్నో టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలతో మనం ఎంచక్కా ఈ ప్రదేశాలని చూసి రావచ్చు. విశాఖపట్నం నుంచి కేరళకు ఓ ప్యాకేజీ ని తెచ్చింది.
ఫ్లైట్‌లో తీసుకెళ్లి కేరళ అందాలు చూపించనుంది ఐఆర్‌సీటీసీ. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
మెస్మరైజింగ్ కేరళ పేరుతో ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ని అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. కొచ్చి, మున్నార్, అలెప్పీ లేదా కుమారకోమ్ వంటివి చూడవచ్చు. 2023 అక్టోబర్ 14న కేరళ టూర్ మొదలు కానుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే హౌజ్‌బోట్‌లో కూడా స్తే చేయొచ్చు. మొదటి రోజు విశాఖపట్నంలో టూర్ స్టార్ట్ అవ్వనుంది.

ఉదయం 7.40 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే… మధ్యాహ్నం 1.20 గంటలకు కొచ్చిన్ రీచ్ అవుతారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం మెరైన్ డ్రైవ్, బోటింగ్ ఉంటుంది. రాత్రికి కొచ్చిలో ఉండాలి. రెండో రోజు కొచ్చి సైట్‌సీయింగ్. డచ్ ప్యాలెస్, సెయిన్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రూజ్ బసిలికా చూసేసాక మున్నార్. రాత్రికి మున్నార్‌లో ఉండాలి. మూడో రోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్. అలానే టీ మ్యూజియం, మెట్టుపట్టి డ్యామ్, ఈకో పాయింట్, కుండల లేక్ చూడొచ్చు.

పునర్జని కల్చరల్ విలేజ్ కి కూడా వెళ్ళచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. కుమారకోమ్ లేదా అలెప్పీ కూడా చూడచ్చు. హౌజ్‌బోట్‌లో బస చేయొచ్చు. ఐదో రోజు త్రివేండ్రం లేదా కోవలం. అఝిమల ఆలయం, కోవలం బీచ్ కి వెళ్ళచ్చు. రాత్రికి త్రివేండ్రం లేదా కోవలంలో ఉండాలి. ఆరవ రోజు ఉదయం శ్రీ పద్మనాభస్వామి అలయం. ఆ తర్వాత తిరుగు ప్రయాణం. ఉదయం 10.15 గంటలకు త్రివేండ్రంలో బయల్దేరితే రాత్రి 1.55 గంటలకు వైజాగ్ వచ్చేస్తారు. ధర విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.38,110, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.40,925, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.56,635 పే చేయాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news