మిస్డ్ కాల్స్‌కు స్పందించారో అంతే.. మీ ఖాతాలోని డబ్బులు గోవిందా..!

-

మిస్డ్ కాల్.. ఇది కొంచెం క్యూరియాసిటీని కలిగించే అంశం. ఏదైనా కొత్త నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే చాలు.. ఎవరో అనుకొని వెంటనే కాల్ చేస్తాం. తెలిసిన నెంబర్ అయితే పర్లేదు కానీ.. తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే మాత్రం కాస్త ఆలోచించాల్సిందేనని అంటున్నారు. ఈ మధ్య వన్ రింగ్ స్కామ్ విపరీతంగా పెరిగిపోతోందట. వన్ రింగ్ స్కామ్ అంటే.. మీకు వచ్చే ఇన్‌కమింగ్ కాల్‌లో ఒక్కసారి రింగ్ అవుతుంది. అంతే.. వెంటనే ఫోన్ కట్ అవుతుంది. ఇటువంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలట. వీటినే రోబో కాల్స్ అని కూడా పిలుస్తారట. ఇటువంటి కాల్స్‌కు రిటర్న్ కాల్ చేయకూడదని యూఎస్‌కు చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ హెచ్చరిస్తోంది.

నేషనల్ కంటే.. ఇంటర్నేషన్ కాల్స్‌పైనే ఎక్కువగా శ్రద్ధ చూపాలట. ఇంటర్నేషనల్ కాల్స్‌లో కొన్ని త్రీడిజిట్స్ మాత్రమే ఉంటాయట.. అటువంటి కాల్స్‌కు అయితే అస్సలు రిటర్న్ కాల్స్ చేయొద్దంటున్నారు. రిటర్న్ కాల్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు ఆ ఫోన్‌ను హ్యాక్ చేయడమో.. ఫోన్‌లో ఉన్న డేటాను తస్కరించడమో.. లేదా.. రిటర్న్ కాల్ రాగానే.. వాళ్ల దగ్గర ఉన్న సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడం లాంటి హ్యాకింగ్‌కు పాల్పడతారట.

అలా.. ఖాతాకు అనుసంధానం అయి ఉన్న ఫోన్ నెంబర్‌తో అకౌంట్‌లోని డబ్బులన్నింటినీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారని ఆ సంస్థ చెబుతోంది. ఫేక్ కాల్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సంస్థ సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version