మనసుకు నచ్చిన పక్కన ఉన్నప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అదే మనసుకు నచ్చిన ప్రాంతంలో మనసుకు నచ్చిన వారు దగ్గరగా ఉన్నప్పుడు గాల్లో తేలుతున్నట్టే ఉంటుంది. క్లౌడ్ నైన్ మూమెంట్ అంటే అదేనేమో! ఈ అనుభవాన్ని అనుభవించడానికి కొంచెం రసాస్వాదన కావాలి. మీరు ప్రేమించినవారిని పక్కన ఉంచుకుని ప్రకృతి ఒడిలో సేదతీరడానికి ఆమాత్రం రొమాంటిసిజం ఉండాలి. ఐతే మీ రొమాంటిసిజాన్ని సంతృప్తి పరిచే అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొడైకెనాల్
బెంగళూరు చుట్టుపక్కల ఉండే మీకోసం కొడైకెనాల్ చూడదగ్గ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇళ్ళల్లో తయారు చేసే చాక్లెట్లను చూడడంతో పాటు అందమైన ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవచ్చు.
కుమార కోమ్
బ్యాక్ వాటర్ స్వర్గంలో మునిగి తేలడానికి కేరళలోని కుమార కోమ్ కి వెళ్ళవచ్చు. లగ్జరీతో పాటు ఆయుర్వేద స్పా ప్రత్యేకం. పచ్చని చెట్ల నడుమ కొత్త సంస్కృతిని తెలుసుకోవాలంటే ఇక్కడకు వెళ్ళండి.
కనతల్
ఏకాంత వాతావరణాన్ని ఇష్టపడేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఉత్తరాఖండ్ కొండల్లోని ఈ ప్రాంతం హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది. కొండ నడక మీకు సరికొత్త అనుభూతిని పంచుతుంది.
పాలంపూర
హాయిగా అనిపించే చిన్న చిన్న అతిధి గృహాలు, విలాసవంతమైన కేఫ్ లు, హిమాలయ స్కైలైన్ చూడాలనుకునేవారికి ఇదొక అద్భుత ప్రపంచంగా తోస్తుంది. టీ తోటల గుండా నడిచే నడక మీ జీవితంలో మరపురాని ప్రయాణంగా నిలుస్తుంది. దీనికోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాల్సిందే.
నలంద, రాజ్ గిర్
మీకు చరిత్ర అంటే ఇష్టం ఉండి, పురావస్తు మీద ఆసక్తి ఉన్న వారు నలంద ప్రదేశాన్ని సందర్శించండి. ఇక్కడ బౌద్ధమత పాఠాలు మీకోసం ఎదురుచూస్తుంటాయి.