మంచి చోటుకి వెళ్లాలనుకుంటున్నారా..? అయితే 2500 నెమళ్లు వుండే ఈ ప్రదేశాన్ని చూసొచ్చేయండి..!

-

ఒక్కొక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుంది ఈ రొటీన్ అంతటినీ పక్కన పెట్టేసి ఏదైనా మంచి ప్రాంతాన్ని చూసి వచ్చేయాలని. పైగా కామన్ ప్లేసెస్ కాకుండా కొంచెం కొత్తగా స్పెషల్ గా ఉండే ప్రదేశాలని చూడడం చాలా మందికి ఇష్టం. మీరు కూడా అలాంటి వాళ్ళైతే కచ్చితంగా ఈ ప్రదేశాన్ని చూడాలి.

 

ఈ ప్రదేశం నెమళ్ళతో ఎంతో అందంగా ఉంటుంది. ఇది పూణేలో ఉంది ఆంధ్ర కర్ణాటక మొదలైన రాష్ట్రాల వాళ్ళు చక్కగా ఈ ప్రదేశాన్ని చూసి వచ్చేయొచ్చు. అందమైన నెమళ్ళు బాగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఏకంగా 2500 నెమళ్ళు ఉన్నాయి. మరి ఇక ప్రదేశానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూసేద్దాం.

పూణే నుండి గంట ప్రయాణ దూరంలో ఇది ఉంది. ఈ ఊర్లో నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పీకాక్ విలేజ్ అని కూడా అంటారు. 300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గ్రామం లో చక్కటి నెమళ్ళు ఉంటాయి ఇక్కడ ఉండే చింత చెట్లపై కూడా కొన్ని నెమళ్ళు నివసిస్తూ ఉంటాయి ఈ ఊరు పేరు మొరాచీ చించోలి. పూణేకి 60 కిలోమీటర్ల దూరంలో మొరాచీ చించోలి ఉంది.

ఈ గ్రామంలో ఉండే ప్రజలు నెమళ్లను చక్కగా చూసుకుంటారు పైగా ఇక్కడ పీష్వా రాజుల కాలంలో చింతపండు చెట్లని నాటారు. ఏకంగా ఇక్కడ చింతపండు చెట్లు వేలల్లో ఉంటాయి. ఈ చెట్ల మీద నెమళ్ళు ఉంటాయి.

అగ్రో టూరిజం కూడా ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంది పైగా ఇక్కడ రిసార్ట్స్, హోటల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. పర్యటకులు వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. చలికాలంలో ఈ ప్రదేశాన్ని చూడడానికి చాలా బాగుంటుంది. ఒక పక్కన నెమళ్ళు మరొక పక్కన ప్రకృతి సోయగాలు పర్యటకులని చక్కగా ఆకట్టుకుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news