ఈ శీతాకాలంలో మంచు కురిస్తే చూడాలని వుందా..? అయితే ఇండియా లో వుండే ఈ ప్రదేశాలే బెస్ట్..!

-

చాలా మందికి దూర ప్రాంతాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎక్కువగా ట్రావెల్ చేసేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. మీరు కూడా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఈ ప్రదేశాలకి వెళ్లండి శీతాకాలంలో ఈ ప్రదేశాల్లో మంచు కురుస్తూ ఉంటుంది.

కనుక ఈ సమయంలో ఈ ప్రదేశాలను చూడటానికి చాలా బాగుంటుంది. పైగా మంచు కురుస్తూ ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఉత్తర భారత దేశంలో ఉండే కొన్ని ప్రాంతాలలో హిమపాతం మొదలైంది ఈ ప్రదేశాలని చూసేందుకు మరి ప్లాన్ చేసుకోండి.

ఔలి:

ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. నవంబర్ నెలలో ఉష్ణోగ్రత 4 నుండి 14 డిగ్రీలకు వెళ్తుంది. ఇది ఢిల్లీ నుండి సుమారు 375 కిమీ దూరంలో వుంది. చలి కాలంలో ఇక్కడకి వెళ్లినా కూడా బాగుంటుంది.

షిమ్లా:

షిమ్లా ని చూడడానికి చాలా బాగుంటుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వున్న షిమ్లా ని చూసేందుకు చాలా మంది వెళ్తూ వుంటారు. హిమపాతం, ఎత్తైన హిమాలయా పర్వతాలను చూడాలని అనుకుంటే ఇది బెస్ట్. ఢిల్లీ నుండి సుమారు 350 కిమీ దూరంలో షిమ్లా వుంది. 21 నుండి 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది ఇక్కడ.

మనాలి:

మనాలి కూడా అద్భుతమైన ప్రదేశం. ఢిల్లీ నుండి మనాలి 537 కి.మీ. దూరం. ఫ్యామిలీ తో వెళ్ళచ్చు లేదంటే కపుల్స్ కూడా వెళ్ళచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రత 10 నుండి 5 డిగ్రీల వరకు ఉంటుంది. షిమ్లా, మనాలి, కులు అన్నీ చుట్టేసి వచ్చేయచ్చు. చలి కాలంలో ఇక్కడకి వెళ్లినా కూడా బాగుంటుంది.

లాన్స్‌డౌన్:

చలికాలంలో ఇక్కడికి కూడా వెళ్ళచ్చు. ఢిల్లీకి ఇది దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 15 నుండి 5 డిగ్రీల దాకా ఉంటుంది. అందమైన ప్రకృతి తో సమయాన్ని గడిపి ఎంజాయ్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news