ఐఆర్​సీటీసీలో క్రూజ్ బుకింగ్ తో సముద్ర ప్రయాణం చెయ్యచ్చు..!

చాలా మంది సముద్ర ప్రయాణాలు చెయ్యాలని అనుకుంటారు. కానీ ఎప్పటికీ అది అలానే ఉండిపోతుంది. మీకు కూడా సముద్ర ప్రయాణాలు ఇష్టమా..? వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ ప్యాకేజీని చూడాలి. ఇండియన్ రైల్వేస్​ కాటరింగ్ అండ్ టూరిజం​ కార్పొరేషన్ లిమిటెడ్​ (IRCTC) ప్రత్యేక క్రూజ్ ప్యాకేజీలను తీసుకు రావడం జరిగింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే..

IRCTC
IRCTC

ముంబై నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఓడ ప్రయాణం కోసం కార్డెలా క్రూజెస్​తో ఐఆర్​సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్​లో సముద్ర తీరం వెంట ఉన్న ప్రాంతాలను చూడాలనుకుంటున్న వారి కోసం క్రూజ్ బుకింగ్​ సర్వీస్​ను ఐఆర్​సీటీసీ.. ఈ నెలలోనే ప్రారంభించింది. సెప్టెంబర్​, అక్టోబర్, నవంబర్​, డిసెంబర్ నెలల్లో ప్రయాణం కోసం టికెట్లు బుక్​ చేసుకోవచ్చు. ముంబై నుంచి గోవా, డయూ, లక్ష్యదీప్​, కొచ్చి లాంటి నగరాలకు వెళ్ళచ్చు. తొలి దశలో ముంబై నుంచి ప్రయాణాలు వున్నాయి. మిగిలిన చోట్లకి కూడా త్వరలో తీసుకు రానుంది.

క్రూస్ వీకెండర్​ :

ఈ టూర్ 5 రాత్రుళ్లు, 6 రోజులు. 20 సెప్టెంబర్ న ఇది స్టార్ట్ అవుతుంది. ధర రూ.23,467 నుంచి ఉంటుంది ముంబై నుంచి రెండు ప్రాంతాలకు ప్రయాణం ఉంటుంది.

కేరళ డిలైట్:

ఇది 2 రాత్రుళ్లు, 3 రోజులు టూర్. 20 సెప్టెంబర్ న మొదలు అవుతుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.19,898 నుంచి ఉంటుంది. ముంబైలో క్రూజ్ మీద కేరళ వెళ్లి అక్కడ పర్యాటక ప్రాంతాలను చూడచ్చు.

సన్​డౌనర్​ టూ గోవా..

ఇది 2 రాత్రుళ్లు, 3 రోజులు టూర్. 25 సెప్టెంబర్​ న స్టార్ట్ అవుతుంది. రూ.23,467 నుంచి
ప్యాకేజీ ఉంటుంది. ముంబై నుంచి గోవాకు సముద్రంపై ప్రయాణించవచ్చు.

లక్ష్యదీప్​కు:

ఇది 5 రాత్రుళ్లు 6 రోజులు టూర్. 27 సెప్టెంబర్​ న టూర్ స్టార్ట్ అవుతుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.49,745 నుంచి మొదలు. మరిన్ని వివరాలు ఐఆర్​సీటీసీ టూరిజం అధికారిక వెబ్​సైట్​ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.