ఎప్పుడైనా తమిళనాడు వెళ్తే.. ఈ వాటర్ ఫాల్స్ ను కూడా సందర్శించండి. చుట్టూ కొండలు, గుట్టలు, అడవి, చెట్లు. ఆ చెట్ల మధ్యలో కొండల నుంచి జాలు వారుతూ వచ్చే సెలయేరు.. అద్భుతంగా ఉంటుంది నమ్మ అరువి వాటర్ ఫాల్స్.
నమ్మ అరువి వాటర్ ఫాల్స్.. తమిళనాడు వెళ్తే కచ్చితంగా చూడాల్సిన వాటర్ ఫాల్స్. చిన్న వాటర్ ఫాలే కానీ.. అక్కడికెళ్లా కాసేపు ప్రశాంతంగా గడపొచ్చు. ఆ వాటర్ ఫాల్ నుంచి జాలువారే నీళ్లు.. స్వచ్ఛమైనవి. కాసేపు స్వచ్ఛమైన నీటితో స్నానం చేస్తే వచ్చే కిక్కే వేరప్పా.
అందుకే… ఎప్పుడైనా తమిళనాడు వెళ్తే.. ఈ వాటర్ ఫాల్స్ ను కూడా సందర్శించండి. చుట్టూ కొండలు, గుట్టలు, అడవి, చెట్లు. ఆ చెట్ల మధ్యలో కొండల నుంచి జాలు వారుతూ వచ్చే సెలయేరు.. అద్భుతంగా ఉంటుంది నమ్మ అరువి వాటర్ ఫాల్స్.
ఈ వాటర్ ఫాల్స్ ను వెళ్లాలంటే చెన్నై నుంచి వెళ్లాలి. చెన్నై నుంచి 360 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ అనే పట్టణం ఉంటుంది. అక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరం పోతే నమ్మ అరువి వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది.
ఈ వాటర్ ఫాల్స్ కు పెద్దగా టూరిస్టుల తాకిడి కూడా ఉండదు. చాలా తక్కువ మంది వస్తారు. దీంతో అక్కడ చాలా సమయం స్పెండ్ చేయొచ్చు.
పార్కింగ్ ప్లేస్ నుంచి 300 మీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది అంతే. నవంబర్ నుంచి ఫిబ్రవరి సమయంలో ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఆ సీజన్ లో వెళ్తే మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు.