మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి..? ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయవచ్చు..?

ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్ మెంట్ అనగానే మ్యూచువల్ ఫండ్లలో పెట్టమని చెబుతున్నారు. ఐతే మ్యూచువల్ ఫండ్స్ అంతే ఏమిటి..? అవి ఏ విధంగా పనిచేస్తాయి. వాటిలో ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్:

ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా 25 నుండి 30రకాల కంపెనీలని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్టర్ల నుండి తీసుకున్న డబ్బునంతా ఆ 30రకాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ పెట్టుబడిని మేనేజ్ చేసే వారిని ఫండ్ మేనేజర్ అంటారు. పెట్టుబడి దారుల దగ్గర నుండి వచ్చిన మొత్తాన్ని ఒకే కంపెనీలో కాకుండా వివిధ రకాల వైవిధ్యమైన కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటారు.

మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే పద్దతులు:

ఒక పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఎంతైనా కావచ్చు. లక్షా, పదివేలు, ఐదువేలు.. ఇలా. అలా కాకుండా నెలకి ఒకసారి ఒక ప్రత్యేకమైన తేదీని నిర్ణయించుకుని ఒక నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే నెలకి 5వేల రూపాయలు ఒక ప్రత్యేకమైన తేదీన మన బ్యాంకు ఖాతా నుండి మ్యూచువల్ ఫండ్లలోకి వెళ్ళిపోతుంది. దీన్ని సిప్ అంటుంటారు.

మ్యూచువల్ ఫండ్లలో మేజర్ గా ఈక్విటీలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈక్విటీలో రిస్క్ ఎక్కువ. అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువే. ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ లాభాలు వస్తాయన్నమాట. ఐతే ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువ కాలం ఉంచాల్సి ఉంటుంది. ఈక్విటీలో కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ అనే క్యాటగిరీలు ఉంటాయి. మన అవసరాన్ని బట్టి మనకి ఏది సరైనది అనుకుంటే అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెట్ ఫండ్ ఉత్తమం. వీటిలో ఒక రోజు కూడా ఇన్వెస్ట్ చేసుకునే వీలుంది.

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకి లోబడి ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే ముందు స్కీముకి సంబంధించిన అన్ని దస్తావేజులు సరిగ్గా చదవండి.