ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారన్న ఫిర్యాదులతో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ గురువారం రాత్రి నుంచి చేపట్టిన సోదాలు శనివారం తెల్లవారుజూమున ముగిశాయి.
అక్టోబర్ మూడో తేదీన ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో రూ.20 కోట్లు లెక్కలు చూపని ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం రేవంత్ బామ్మర్ది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మొత్తంగా తేలింది. అయితే రేవంత్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన సీతక్క, వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.