వాట్సప్ ప్రైవేట్ కాదు: రిపోర్ట్

తాజా రిపోర్టుల ప్రకారం ఫేస్బుక్ వాట్సప్ ప్రైవేట్ కాదని తెలుస్తోంది. వాట్సాప్ చెప్పిన దాని ప్రకారం ఎవరైతే మెసేజ్ పంపిస్తారో వాళ్లు మరియు ఎవరికైతే మెసేజ్ పంపిస్తారో వాళ్లు మాత్రమే ఆ సమాచారాన్ని చూడగలరని…. కనీసం వాట్సాప్ కూడా ఈ మెసేజ్లు మరియు ఇతర సమాచారాన్ని చూడదు అని చెప్పడం జరిగింది. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

whatsapp

ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కూడా కంపెనీ ఎలాంటి వాట్సాప్ మెసేజ్లు చూడదు అని చెప్పారు. అలానే 2018 లో వాట్సప్ లో ఎలాంటి కంటెంట్ కూడా మేము చూడమని వాళ్ళు వెల్లడించారు. వాట్సప్ అనేది ఎంతో పాపులర్ యాప్ అని మనకి తెలుసు. చాలా మంది వాట్సాప్ ని రోజు వాడుతున్నారు.

మీ మెసేజ్లు మరియు మీ ఫోన్ కాల్స్ కూడా ఎంతో భద్రంగా ఉంటాయని మేము వినమని, చూడమని అప్పట్లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రో పబ్లిక్ రిపోర్టు ప్రకారం అవి నిజం కాదని తెలుస్తోంది. వాట్సాప్ కి వెయ్యి మందికి పైగా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారని… ఆస్టిన్, టెక్సస్, సింగపూర్ ప్రాంతాలలో వాళ్లు ఉన్నట్లు కంటెంట్ ని చూస్తారని తెలుస్తోంది. అయితే ఎవరైనా వాట్సాప్ లో రిపోర్ట్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు వాట్సాప్ ఆ ప్రైవేట్ చాట్ ఓపెన్ చేసి చూస్తుందని తెలుస్తోంది. పేరు, స్టేటస్, ఫోన్ నెంబర్, ప్రొఫైల్ ఫోటో చూడచ్చని.. వాట్సాప్ కి రిలేటెడ్ వున్న ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఎకౌంట్స్ కూడా చూసే అవకాశం ఉందని అంటున్నారు.