ఈ క్రెడిట్ కార్డుతో రూ. 6000 వరకు ప్రయోజనం…!

-

మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారా…? చాల మంది క్రెడిట్ కార్డుని ఉపయోగించరు. క్రెడిట్ కార్డుని ఉపయోగించడం మంచిదే. పైగా క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లు, ఆఫర్లు కూడా వస్తాయ్. ఈ క్రెడిట్ కార్డుని కనుక మీరు ఉపయోగించారు అంటే ప్రతి లావాదేవీకి 500 రూపాయల వరకు క్యాష్ ‌బ్యాక్ పొందవచ్చు. అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డుని ఇస్తాయి.

అయితే యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డ్ ప్రత్యేక క్రెడిట్ కార్డు అనే చెప్పాలి. దీని వలన కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. మీరు ఫ్రీచార్జ్ యాప్ లేదా వెబ్‌సైట్‌ లో లావాదేవీ చేస్తే, ప్రతి లావాదేవీకి మీకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

క్యాష్ ‌బ్యాక్ ప్రయోజనం కూడా లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ పరిమితి లావాదేవీకి గరిష్టంగా రూ .500. అంటే, ఈ కార్డుతో ప్రతి లావాదేవీకి మీరు 500 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే ఏడాది లో ఎంత క్యాష్ బ్యాంక్ ఉంటుంది అంటే… మీరు యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డు లో సంవత్సరం లో ఏకంగా రూ.6000 రూపాయల క్యాష్ ‌బ్యాక్ పొందవచ్చు.

ఇది ఇలా ఉంటే ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డుతో ఫ్రీచార్జ్ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్, బిల్ చెల్లింపు లేదా బస్ బుకింగ్ వంటివి చేసారు అంటే వాటి పై మీకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదే మీరు ఓలా, ఉబెర్ లేదా షటిల్ పై దీనిని వాడితే 2% క్యాష్‌బ్యాక్ సహా ఇతర లావాదేవీలపై 1% ఇవ్వబడుతుంది. యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డ్‌లో చేరడానికి రుసుము 250 రూపాయలు. దాని వార్షిక రుసుము కూడా 250 రూపాయలు మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news