కొందరు రెగ్యులర్ జాబ్ లతోపాటు ఫ్రీలాన్సర్‌గా కూడా పనిచేస్తుంటారు. తమకు ఉన్న స్కిల్స్ తో సొంతంగా పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. కంపెనీలు లేదా వ్యక్తులకు సేవలు అందించి లేదా వస్తువులను అమ్మి ఫ్రీలాన్సర్‌గా డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఫ్రీ లాన్సర్‌గా పనిచేసినా దాంతో వచ్చే ఆదాయం ట్యాక్స్ ( Tax ) పరిధిలోకి వస్తే కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే.
అయితే ఫ్రీ లాన్సర్‌గా పనిచేసినా దాంతో వచ్చే ఆదాయంతో కొంత వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఫ్రీలాన్సర్‌గా చేస్తే క్లయింట్ల వద్దకు తిరగడం లేదా ఇతర ఖర్చులు ఉంటాయి కనుక ఆ ఖర్చులను ఆదాయంలోంచి తీసి తరువాత వచ్చే ఆదాయాన్ని రెగ్యులర్ ఆదాయానికి కలపాలి. ఆ తరువాత మొత్తం ఆదాయానికి గాను ట్యాక్స్ పరిధిలోకి వస్తే ట్యాక్స్ ను చెల్లించాలి.
అయితే పన్ను మొత్తం రూ.10వేలు అంతకన్నా ఎక్కువగా ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించవచ్చు. ఇక అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్లు 234బి, 234సి ప్రకారం పెనాల్టీ పడుతుంది. కనుక ఇలాంటి సందర్భాల్లో అడ్వాన్స్ ట్యాక్స్ ను చెల్లించడమే మేలు.
ఇక మీరు ఫ్రీలాన్సర్ వర్క్ చేస్తూ అందులో భాగంగా వస్తువులను అమ్మినా, సేవలను అందించినా జీఎస్‌టీని వసూలు చేయాలి. భిన్న రకాల వస్తువులకు భిన్నంగా జీఎస్‌టీ ఉంటుంది. ఇక సేవలకు అయితే 18 శాతం జీఎస్‌టీ వసూలు చేయాలి. దీంతోపాటు టీడీఎస్‌ను కూడా కట్ చేయాలి. ఇలా ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూనే పన్ను మినహాయింపులు పొందవచ్చు.