Pan Card Scam : ఈ జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందుల్లో పడటం ఖాయం!

-

Pan Card Scam : పాన్ కార్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాన్ని దుర్వినియోగం కానివ్వకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. మీ పాన్ కార్డు దుర్వినియోగమైతే కచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు. పాన్ కార్డ్ స్కాం జరిగిందంటే మీరు కష్టపడి సంపాదించిన ఆదాయం అంతా పోతుంది. ఒక వేళ మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయ్యి మీరు మోసపోతే కచ్చితంగా వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయండి.అందుకోసం ఆన్ లైన్లో కొన్ని టిప్స్ పాటించాలి.

Pan Card Scam

ముందుగా మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ పోర్టల్‌కి వెళ్ళాలి. అందులో కస్టమర్ కేర్ విభాగానికి వెళ్లి, ఫిర్యాదులు/ప్రశ్నలు అనే ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి.వెంటనే ఫిర్యాదు ఫారమ్‌ను పూర్తిచేసి, మీ పాన్ కార్డ్ సమస్యను వివరించాలి. ఆ తరువాత క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి.

అలాగే మీ పాన్ కార్డు ద్వారా ఎవ్వరైనా మోసపూరిత లావాదేవీలకు పాల్పడుతున్నారా అనే విషయాన్ని కూడా ముందుగా తెలుసుకోవాలిసిన బాధ్యత ఉంది. అందుకోసం ఆన్ లైన్ లో ఈజీగా చేసుకోవచ్చు. మీరు క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్‌ లోకి వెళ్లి, మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయండి. తరువాత మీ పాన్ కార్డు వివరాలను ఎంటర్ చేయండి, మీ ఫోన్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి.

ఒకవేళ మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయితే మీ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇక మీ పాన్ కార్డ్ మోసాలను గురికాకుండా ఉండటానికి కూడా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. యూఆర్ఎల్ ‘https’తో స్టార్ట్ అయిన వెబ్ సైట్లో మాత్రమే మీ పాన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఏదైనా అనుమానాస్పదమైన వెబ్‌సైట్‌లలో మాత్రం అస్సలు వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయకండి.

మీ క్రెడిట్ స్కోర్‌ను కచ్చితంగా క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి.ఇక మీ పాన్ కార్డుకు లింక్ చేయబడిన లావాదేవీల వివరాలను తెలుసుకోవడానికి ఫారమ్ 26ఏఎస్ ను చెక్ చేయండి.

పైన తెలిపిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాన్ కార్డ్‌ను దుర్వినియోగం కాకుండా ఉంచుకోవచ్చు. కాబట్టి పాన్ కార్డ్ స్కామ్స్ జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version