ఈ స్కీమ్ లో రూ.210 కడితే..నెలకు రూ.5 వేలు పెన్షన్..వివరాలు ఇవే..

-

వృద్దులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.అందులో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ పాపులర్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరేవారికి వృద్ధాప్యంలో రూ.1,000 నుంచి రూ.5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది.

- Advertisement -

ఈ పెన్షన్ పొందాలంటే స్కీమ్‌లో చేరిననాటి నుంచి ప్రతీ నెలా కొంత మొత్తం జమచేస్తూ ఉండాలి. జమ చేసే మొత్తాన్ని బట్టి పెన్షన్ లభిస్తుంది. ఈ పాపులర్ పెన్షన్ స్కీమ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే 99 లక్షల మంది చేరారు. అంటే సుమారు 1 కోటి మంది ఈ స్కీమ్‌లో చేరారు. 2022 మార్చి నాటికి ఈ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య 4.01 కోట్లు దాటింది.

చిన్న వయస్సు నుంచే రిటైర్‌మెంట్‌ ఫండ్‌పై దృష్టి పెట్టాలనుకునేవారికి అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) అందుబాటులో ఉంది. ముఖ్యంగా టీనేజర్లు ఈ పథకంలో చేరితే మిగతా వయస్కులకన్నా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. వయస్సు పెరిగేకొద్దీ ప్రీమియం పెరిగే ఈ పథకానికి 18-40 ఏళ్లవారు అర్హులు.18 ఏళ్లవారు ఈ పథకంలో చేరితే 42 ఏళ్లపాటు ప్రీమియంలు చెల్లిస్తూ పోవాలి. అలాగే 40 ఏండ్లవారు.. మరో 20 ఏళ్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఖాతాదారుల వయస్సు ఏదైనా.. వారికి 60 ఏళ్లు వచ్చేదాకా ప్రీమియం చెల్లింపు చెయ్యాల్సి ఉంటుంది.

పథకంలో చేరాలనుకునేవారికి తప్పకుండా బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌లో సేవింగ్స్‌ ఖాతా ఉండాలి. ఖాతా ఉన్నచోట సిబ్బంది సహాయంతో ఏపీవై రిజిస్ట్రేషన్‌ ఫారాన్ని నింపాలి. ఆధార్‌, మొబైల్‌ఫోన్‌ నెంబర్‌ తదితర వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఎంచుకున్న చెల్లింపుల పద్ధతిని అనుసరించి ఏపీవైకి మీ ప్రీమియం సొమ్ము ఖాతా నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెల, 3 నెలలు, 6 నెలల చొప్పున ప్రీమియం చెల్లింపునకు అవకాశం ఉంది.

3 లేదా 6 నెలలకోసారి చెల్లించేవారికైతే ఈ ప్రీమియం రూ.125, రూ.248గా ఉంది. ఇక నెలకు రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.5 వేల చొప్పున పెన్షన్‌ పొందాలనుకుంటే.. ఆయా ప్రీమియంలూ అంతే ప్రాతిపదికన పెరుగుతాయి. మొత్తంగా ఈ పథకంలో నెలకు కనిష్ఠంగా వెయ్యి రూపాయలు, గరిష్ఠంగా రూ.5 వేలు పెన్షన్‌గా తీసుకోవచ్చు..60 ఏళ్ల లోపే లబ్ధిదారు చనిపోతే భర్త లేదా భార్యకు ప్రీమియంలు కొనసాగించే అవకాశం. పెన్షన్ కాలంలో వీరు మరణిస్తే నామినీలకు ఏకమొత్తాల్ని చెల్లిస్తారు. 60 ఏళ్ల తర్వాత లబ్ధిదారుడు చనిపోతే నామినీకి వారి కోరిక మేరకు పెన్షన్‌ ను ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...