మద్దతు విషయంలో ఉద్ధవ్ ఠాక్రేపై ఒత్తిడి: సిన్హా

-

రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన పార్టీ నేత ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్, ఎంవీఏ పార్టీ సీరియస్ అయింది. అయితే తాజాగా ఈ విషయంపై విపక్ష పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్పందించారు. ముర్ముకు మద్దతు తెలపాలని ఉద్ధవ్ ఠాక్రేను బలవంతం చేశారని ఆరోపించారు. గువహటిలో మీడియా సమావేశంలో సిన్హా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం వ్యవస్థను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తోందని సంచలన ఆరోపణ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ, గవర్నర్ కార్యాలయం వంటి ఏజెన్సీలను ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు.

యశ్వంత్ సిన్హా
యశ్వంత్ సిన్హా

ఒకే పార్టీ.. ఒకే పాలకుడు.. అనే ఎజెండాతో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పటివరకు స్పందిచకపోవడం ఆశ్చర్యకరమని సిన్హా అన్నారు. వ్యక్తిగతంగా ముర్ము అంటే గౌరవమన్నారు. కానీ రాజ్యాంగ నిబద్ధతను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. గత నెలలో జరిగిన విపక్షాల సమావేశానికి హాజరైన ఠాక్రే.. తొలుత యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఉద్ధవ్ ఠాక్రే ముర్ముకు మద్దతు ప్రకటించారు. అయితే శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో 16 మంది ఎంపీలు ఎన్‌డీఏ అభ్యర్థి ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news