YSR రైతు భరోసా పథకానికి మీరు అర్హులేనా చెక్ చేసుకోండి..

-

ఏపీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్ర‌మంలోనే వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి విధివిధానాలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకాన్ని అక్టోబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. రైతులు, కౌలు రైతులలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.12,500 చొప్పున అందిస్తుంది.

అలాగే ల‌బ్ధిదారుల ఖాతాల‌కు నేరుగా జ‌మ చేస్తార‌ని ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసే భూమితో సంబంధం లేకుండా ప్రతి రైతు కుటుంబానికి పథకాన్ని వర్తింపజేస్తూ విధివిధానాలు జారీ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు వర్తిస్తుంది. మ‌రి ఈ ప‌థ‌కానికి అర్హులు.. అన‌ర్హులు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం..

అర్హులు

– ఉద్యాన పంటలు కనీసం ఎకరం భూమి సాగులో ఉండాలని నిబంధన.
– కూరగాయలు, పువ్వులు, పశువుల మేత కోసం కనీసం అర ఎకరం భూమి సాగు చేస్తుండాలి.
– కౌలు రైతులకు రైతు భరోసా కల్పించేలా మార్గదర్శకాలు
– ఒక యజమానికి ఒకరికి మించి కౌలుదారులుంటే ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. ఈ విషయంలో.. ఒకరికి మించి కౌలుదారులుంటే ఎస్టీలకు ప్రాధాన్యం కల్పిస్తారు. ఆ తర్వాత ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తారు.

అన‌ర్హులు

– ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు రైతు భరోసా స్కీమ్ వర్తించదు. మేయర్లు, జడ్పీ చైర్మన్లకు ఇతర ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు.
– ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి అనుబంధ కార్యాలయాలు, ప్రభుత్వ పరిధిలోకి వచ్చే స్వతంత్ర సంస్థల ఉద్యోగులు, స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగుల‌కు వ‌ర్తించ‌దు.
– నెలకు రూ.10 వేలు లేదా అంతకుమించి పెన్షన్ పొందుతున్న వారు అనర్హులు. అలాగే అత్యధిక ఆర్థిక హోదా ఉన్న వర్గాలు అనర్హులు.
– సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పరమైన పదవులు నిర్వహించిన, ప్రస్తుతం నిర్వహిస్తున్న వారి కుటుంబాలు అనర్హులు.
– వృత్తిపరమైన సంస్థల కింద రిజిస్టర్ అయి..తమ వృత్తులను కొనసాగిస్తూ గత ఏడాది కాలానికి ఆదాయ పన్ను చెల్లించిన డాక్టర్లు.

Read more RELATED
Recommended to you

Latest news