అందుకే పెళ్ళి ఇష్టం లేదు …సాయి పల్లవి ..!

-

ఫిదా సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ చక్కని గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. నటనలో తన తోటీ వళ్ళతో పోటీ పడి నటించడం సాయి పల్లవి గొప్పదనం. ఒప్పుకున్న సినిమా కోసం నచ్చిన పాత్ర కోసం ఎంతగా శ్రమిస్తుందో చాలామందికి తెలీదు. ఎంత సహజంగా నటించానికి ప్రయత్నిస్తుందో తన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు తను ఎంచుకునే పాత్రలో వల్గారిటి ఉంటే మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా హీరో ఎవరైనా ఆ సినిమాని వదులుకుంటుంది. ఇక తెలుగులో సాయి పల్లవి ఫిదా తర్వాత నాని తో ఎం.సి.ఏ చేసింది. పడి పడి లేచె మనసు కూడా బాగానే ఉన్నప్పటికి ఎందుకనో నిరాశ పరచింది.

 

ఇప్పుడు మరోసారి సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి లవ్ స్టోరీ అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ తో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉందట. ఈ సినిమాతో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్న విరాట పర్వం సినిమాలో కూడా ఒక శక్తి వంతమైన పాత్రని పోషిస్తుంది. నక్సలైట్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుండగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో వరసగా పెళ్ళి చేసుకుంటున్నారు మన సెలబ్రిటీలు. దిల్ రాజు ఇటీవల రెండవ పెళ్ళి చేసుకున్నారు. అలాగే రానా తన ప్రేమని బయట పెట్టి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఇంతకముందే నిశ్చితార్ధం జరిగిన యంగ్ హీరో నిఖిల్ వివాహం కూడా మే 14 న జరిగింది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి దగ్గర పెళ్ళి ప్రస్తావన తీసుకు రాగా … తనకి ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదంటూ వెల్లడించింది. మెడిసిన్ పూర్తి చేసిన సాయి పల్లవిసినిమాలు లేకపోతే డాక్టర్ గా సెటిలవుతానని ఇంతక ముందే క్లారిటి చెప్పింది. ఇక ప్రస్తుతానికి సినిమాల మీదే తన ఫోకస్ ఉందని తన తల్లి దండ్రులతోనే ఉండటానికి ఇష్టపడతానని క్లియర్ గా చెప్పు పెళ్ళి మ్యాటర్ ఇప్పట్లో తన దగ్గర తేవద్దంటూ తేల్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news