ఎన్టీఆర్ విలనా..?

-

అరవింద సమేత సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రాజమౌళి సినిమాకు సన్నద్ధం అవుతున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి మెగా మల్టీస్టారర్ కు నాంధి పలికాడు. చరణ్, ఎన్.టి.ఆర్ లతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం చేశాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతిష్టాత్మక సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై రోజుకో న్యూస్ బయటకు వస్తుంది.

ఇప్పటివరకు పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని వార్తలు రాగా లేటెస్ట్ గా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ప్రతినాయకుడిగా కనిపిస్తారని అంటున్నారు. చరణ్ హీరోగా, ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్. జై లవ కుశ సినిమాలో ఎన్.టి.ఆర్ రావణ పాత్రలో అదరగొట్టాడు. బహుశా అది చూసే జక్కన్నకు ఇలాంటి థాట్ వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు.

ఏది ఏమైనా రాజమౌళి ఆలోచన వేరేలా ఉంటుంది. ఒకవేళ ఎన్.టి.ఆర్ ను నెగటివ్ షేడ్స్ లో చూపించినా అది అభిమానులు సైతం మెచ్చేలా చేస్తాడు. నవంబర్ 18న సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమా మరిన్ని అప్డేట్స్ త్వరలో బయటకు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news