వావ్.. సూపర్… దేశంలోనే అతి పొడవైన రైలు-రోడ్డు వంతెన ఇది…!

-

రైలు కమ్ రోడ్డు వంతెన అంటేనే గుర్తొచ్చేది రాజమండ్రి బ్రిడ్జి. పైన వాహనాలు మధ్యలో ట్రెయిన్ కింద నీళ్లు.. ఆ బ్రిడ్జి మీది నుంచి ట్రెయిన్ పోతుంటే సూపర్ గా అనిపిస్తుంది కదా. అయితే.. ఆ బ్రిడ్జి కంటే పెద్దది.. దేశంలోనే అతి పొడవైన రైలు కమ్ రోడ్డు వంతెనను అస్సాంలో నిర్మిస్తున్నారు. నిర్మాణం కూడా దాదాపు పూర్తికావచ్చింది. టెస్ట్ రన్ నడుస్తున్నది. ఆ వంతెన మీద రైళ్లు 110 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయట. రీసెంట్ గా ఆ బ్రిడ్జి మీది నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తిన ఓ రైలు వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

బ్రహ్మపుత్ర నదిపై దీన్ని నిర్మిస్తున్నారు. దీన్ని బోగీబీల్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. అస్సాంలోని దిబ్రుగఢ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని పాసిఘాట్ ను కలిపేలా ఈ వంతెన నిర్మాణం ఉంటుంది. ఈ బ్రిడ్జి పొడవు దాదాపు 4.94కిలోమీటర్లు. పైన మూడు వరుసల రోడ్డును నిర్మిస్తున్నారు. 2002 లో ఈ వంతెన శంకుస్థాపన జరిగింది. ఈ వంతెన ప్రారంభం అయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల మధ్య దూరం చాలావరకు తగ్గిపోతుంది. చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ప్రధాని మోదీచే ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news