పోలీసు క‌స్ట‌డీలోనే శ్రీ‌నివాస‌రావు.. ఏడాదిలో 9 సెల్‌ఫోన్లు మార్చాడు!

-

విశాఖ: వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో పురోగతిని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా శుక్ర‌వారం మీడియాకు వెల్లడించారు. నిందితుడు శ్రీ‌నివాస‌రావు పదో తరగతి చదివాడని, గత నాలుగు నెలలుగా విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని చెప్పారు. దాడికి వాడిన కత్తి కోడిపందేలుకు వాడిందని, ఆ కత్తి పొడవు 8 సెం.మీలు ఉండగా.. ఆ కత్తిలో వాడిగా ఉన్న భాగం మూడు సెం.మీలేనని వివరించారు. దాంతో పాటు ఘటనా స్థలం నుంచి మరో చిన్న కత్తి కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని, అతడిని కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారనే విషయాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ ఏడాది కాలంలో తొమ్మిది సెల్‌ఫోన్లు మార్చి వాటిలో ఒకే సిమ్‌ను వాడాడని, అలా ఎందుకు చేశాడనేది విచారిస్తున్నట్టు సీపీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news