14 ఏళ్ల కుర్రాడి ప్రాణం తీసిన పబ్జీ.. !

-

నేటికాలంలో కుర్రాళ్లు జీవితానికి పనికి వచ్చే పనులకంటే, జీవితాన్ని నాశనం చేసే వాటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.. ఇందులో ప్రతి వారి చేతిలో మొబైల్ ఇప్పుడు ఆటవస్తువుగా మారింది.. అందులో నెట్ అయితే ఇక చెప్పనవసరం లేదు.. హైస్పీడ్ నెట్ సౌలభ్యంతో ఏదైనా క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.. ఈ దశలో ఎక్కువ మంది యువత పబ్జీ లాంటి ప్రమాదకరమైన గేమ్ లకు అలవాటు పడుతుండగా, మరికొందరు అశ్లీల వీడియోలు చూడటానికి సెల్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు..

ఇకపోతే పబ్జీ గేమ్ లు ఇప్పటికే ఎందరో ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ 14 ఏళ్ల కుర్రాడు తెల్లారేదాకా పబ్జీ గేమ్ ఆడి, అనంతరం పక్క గదిలోకి వెళ్లి ఉరేసుకుని మరణించాడు.. రాజస్థాన్‌లోని కోటాలో వెలుగుచూసిన ఈ ఘటన తాలూకు వివరం చూస్తే.. గత మూడు రోజుల క్రితం తల్లి మొబైల్‌లో పబ్జీ గేమ్ డౌన్‌లోడ్ చేసుకున్న ఆ కుర్రాడు..

 

అప్పటి నుంచి ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటల వరకూ గేమ్ ఆడుకునేవాడట, కానీ ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ ఆ పిల్లవాడు శనివారం ఉదయం తన గదిలోని వెంటిలేటర్‌కు ఉరేసుకుని కనిపించగా, అతన్ని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించేటప్పటికే మరణించినట్లు బాలుడిని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

Read more RELATED
Recommended to you

Latest news