కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు మంగళవారం ఏపీ సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, జీవిత, సి.కల్యాణ్, సురేష్‌బాబు, త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల శివ పాల్గొననున్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్లలో ప్రదర్శనలు, మరికొన్ని సమస్యలపై వారు సీఎంతో చర్చించనున్నారు.