బ్రేకింగ్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు కరోనా..!

-

తెలంగాణ లో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా  సోకగా.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వీహెచ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

అంతకు ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడిన విషయం కూడా తెలిసిందే. ఇలా వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో మిగతా ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. కాగా రాష్ట్రంలో మొత్తం 7072 కరోనా కేసులు నమోదవగా.. ప్రస్తుతం 3363 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 154 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3506కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news