చప్పుడు లేదు: అంతనాడు ఇంతన్నాడు సాయిరెడ్డి.!

-

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటినుంచీ.. విజయసాయి ట్విట్టర్ అకౌంట్ కి ఫుల్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పుకోవాలి! ప్రభుత్వాన్ని పొగడటం కంటే ప్రతిపక్షాలను విమర్శించడంలోనే సాయిరెడ్డి ఈ ట్విట్టర్ ని రాం గోపాల్ వర్మకంటే బలంగా వాడేస్తున్నారని కామెంట్లు కూడా పడుతున్నాయి. ఈ క్రమంలో విజయసాయి ట్విట్టర్ లో ఏమి చెప్పినా… అది ఫ్యూచర్ లో జరిగే విషయం అన్నట్లుగా కార్యకర్తలు నమ్ముతుంటారు. ఆయన ట్వీట్లకు అంత వేల్యూ ఉంది మరి! ఈ క్రమంలో… జూన్ 12న విజయసాయి ఒక ట్వీట్ చేశారు.. దాంతో చాలా మంది చాలా ఊహించుకున్నారు. కార్యకర్తల్లో కొందరైతే మరీ ఎక్కువగా ఊహాగాణాలు చేశారు. కాని జరిగిందేమిటి?

రాజ్యసభ ఎన్నికల్లో గెలవమని తెలిసి కూడా బరిలో దళితులను దింపి రాజకీయ లబ్ధి పొందుతున్నారని విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. “భోగాలు మీవి, త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలవా? రాజ్యసభ సీట్లు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారు. బలం లేక ఓటమిచెందే సమయంలో బడుగు వర్గాల అభ్యర్థులు బలిపశువులవుతారు. ఈనెల19న మీ బలం ఎంతో, వెంట ఉండేది ఎవరో, వదిలి పోయేది ఎవరో తెలిసి పోతుంది” అని ట్వీట్‌ చేశారు. దీంతో… జూన్ 19న ఏదో జరగబోతుందని.. ఇప్పుడున్న ముగ్గురు రెబల్ కాకుండా మరో ముగ్గురు నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అయినా వైకాపాకు అనుకూలంగా ఓటు వేస్తారని అంతా భావించారు. కానీ… అది జరగలేదు!

ఇప్పటికే రెబల్స్ గా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఉపయోగపడకుండా ఓటేసి ఉండొచ్చు కానీ… వైకాపాను అనుకూలంగా మాత్రం ఓటు వేయలేదు! కరోనా పేరుచెప్పి అనగాని సత్యప్రసాద్ సైలంట్ అయిపోతే… ఇంతకాలం సైలంట్ గా ఉన్న గంటా శ్రీనివాస రావు, గణబాబు లాంటి నేతలు సైతం టీడీపీకే ఓటువేశారు! ఇంతకు మించి ఎలాంటి అద్భుతాలూ వైకాపా కార్యకర్తలు ఊహించకపోవచ్చు కానీ… ఆఖరికి అవికూడా జరగలేదు. అధికారులదే తప్పంటూ ఆదిరెడ్డి భవానీ చిన్నపాటి షాక్ ఇచ్చినా… అదికాస్త అధినేత క్షమించేసినట్లే! ఇంక సాయిరెడ్డి ట్వీట్ చేసిన స్థాయిలో ఏమీ జరగలేదు!

దీంతో… ఇంతకాలం సాయిరెడ్డి ట్వీట్లను నమ్మి ముందుగానే స్వీట్లు రెడీ చేసుకునే కొందరు వైకాపా కార్యకర్తలు.. ఇంతన్నాడు, అంతన్నాడు సాయిరెడ్డి… 19వచ్చింది, 20 అయ్యింది.. 21 కూడా వచ్చేసింది… అయినా ఏమీ జరగలేదు ఎందుకో? అంటూ ఆన్ లైన్ వేదికగా సెటైర్స్ వేస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news