భారత్ మరో ముందడుగు.. మార్కెట్ లోకి కరోనా వ్యాక్సిన్..!

-

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీ చేసేందుకు చాలా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్ లు మనుషులపై ప్రయోగించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మధ్యనే దీనికి వ్యాక్సిన్ కనిపెట్టినట్టు భారత్ లోని రెండు కంపెనీలు తెలియజేశాయి. అయితే తాజాగా, ఇప్పుడు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తుంది. పైగా దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. ఆ సంస్థ మరెవరిదో కాదు.. యోగా గురువు బాబా రామ్‌దేవ్ కు చెందిన పతంజలి కావడం విశేషం.

ఈ మేరకు పతంజలి  సీఈఓ ఆచార్య బాలకృష్ణ ట్విటర్ ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. కరోనా ఆయుర్వేద ఔషధం కరోనైల్(Coronil) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హరిద్వార్‌ లోని పతంజలి యోగ్‌ పీట్ లో ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ సమయంలో, మొదటి ఆయుర్వేద ఆధారిత ఆయుర్వేద ఔషధం కరోనిల్ గురించి పూర్తి శాస్త్రీయ వివరాలు కూడా పంచుకోనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ లో బాబా రామ్‌దేవ్ కూడా హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news