దేశ ప్రధానిని నిర్ణయించిన నాయకుడిని నేను- అని చెప్పుకొన్న చంద్రబాబుకు, కేంద్రంలో మాకు ఎవరు తెలుసు? అని చెప్పుకొ న్న జగన్‌కు ఇప్పుడు అదే ఢిల్లీలో పొలిటికల్ గ్రాఫ్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఏడాదిన్నర కిందట.. చంద్రబాబు హవా ఢిల్లీ వీధు ల్లో హోరెత్తిపోయింది. ఢిల్లీ సీఎం, పశ్చిమ బెంగాల్ సీఎం, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం వరకు అందరూ బాబుకు నిత్యం ఫోన్లు చేస్తూ .. ఆయన వ్యూహ రచనలో వారూ పాలుపంచుకున్న పరిస్థితి కనిపించింది. అంతేకాదు, గత ఏడాది జరిగిన ఏపీ ఎన్ని కల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాలు వచ్చి .. చంద్రబాబు పక్షాన ప్రచారం చేశారు. జగన్‌పై దుమ్మెత్తి పోశారు. దీంతో బాబు ఢిల్లీ గ్రాఫ్ ఓ రేంజ్‌కు చేరిందని టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాసి కవితలు అల్లింది.
అదేసమయంలో వైసీపీ అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ కు కూడా ఢిల్లీలో గ్రాఫ్ ఉంది. ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించినా.. నేరుగా వెళ్లి.. నరేంద్ర మోడీతో మాట్లాడినా.. ఆయన శైలి విభిన్నంగా ఉండేది. మరీముఖ్యంగా విజయసాయిరెడ్డిని ఢిల్లీలోనే ఉంచి కేంద్రంతో ఎప్పటికప్పుడు రాజకీయ సంప్రదింపులు చేసేవారు. ఆ గ్రాఫ్‌లో ఎక్కడా తేడారాలేదు. వారు హోదా ఇచ్చినా.. ఇవ్వకున్నా.. జగన్ ఎక్కడ విమర్శించాలో.. అక్కడ ఏకేసేవారు.. ఎక్కడ పొగడాలో.. అక్కడ ఎత్తేసేవారు. ఇక, ఇప్పుడు ఏడాదిన్నర గడిచింది.
మరి ఇప్పుడు ఢిల్లీలో అటు చంద్రబాబు, ఇటు జగన్‌ల గ్రాఫ్ ఎలా ఉంది? ఈ విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రతిపక్షంలోకి చంద్రబాబు వచ్చారు. మరి ఆయన తన ఢిల్లీగ్రాఫ్ను అలానే కొనసాగిస్తున్నారా? అంటే.. లేదనే చెప్పాలి. అంతేకాదు, గతంలో ఆయనను ఆకాశానికి ఎత్తేసిన సీఎంలు, మాజీ సీఎంలు కూడా ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాదు, పాత మిత్రుడు బీజేపీ కూడా బాబును పట్టించుకోవడం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా చైనా విషయంలో అందరి సలహాలూ తీసుకున్నా.. బాబుమాత్రం పక్కన పెట్టేశారు. దీంతో సండేనాటి సెన్సెక్స్ గ్రాఫ్ మాదిరిగా బాబుగారి ఢిల్లీ గ్రాఫ్ నేల చూపులు చూస్తోంది. అక్కడకు వెళ్లినా.. ఎవరూ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక, జగన్ విషయానికి వస్తే.. ఢిల్లీ గ్రాఫ్ దిపావళి నాటి తారాజువ్వ మాదిరిగా అత్యంత వేగంగా పుంజుకుంది. పైపైకి ఎగబాకుతోంది. అంతేకాదు, స్థిమితంగా ముందుకు సాగుతోంది. ఎక్కడా అనవసరంగా పొగడ్తలు, అనవసర తెగడ్తలు లేవు. అదేపనిగా.. భట్రాజు మాదిరిగా మోడీని పొగడే పని జగన్ పెట్టుకోలేదు. దీంతో నిర్మాణాత్మక నాయకుడిగా బీజేపీ పెద్దలు జగన్‌ను భావిస్తున్నారు. అదేసమయంలో ప్రధాన పార్టీలు కూడా జగన్ వ్యూహానికి జైకొడుతున్నాయి. ఇదీ.. మొత్తంగా ఢీల్లీలో బాబు.. జగన్‌ల పొలిటికల్ గ్రాఫ్ తీరు..!