చిన్నారికి ప్రాణం పోసిన మహేశ్ బాబు..! నెటిజన్లు ఫిదా..!

-

mahesh babu gave life to a child suffering from a chronic disease
mahesh babu gave life to a child suffering from a chronic disease

టాలీవుడ్ ప్రిన్స్ సుపర్ స్టార్ మహేశ్ బాబు ఓ అద్భుతమైన పని చేశాడు.. గుండె జబ్బు మెదడు జబ్బుతో పోరాడుతున్న చిన్నారికి ప్రాణం పోసి నిజంగానే తాను ప్రిన్స్ అని నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు అరుదైన గుండె జబ్బుతో బిడ్డ పుట్టింది. ఆ చిన్నారి గత కొన్ని రోజులుగా ఈ జబ్బుతో పోరాడుతుంది. తల్లిదండ్రుల దగ్గర చికిత్స చేయించేందుకు సరిపడా డబ్బు లేదు దాంతో మహేశ్ బాబు ను ఆసృయించిన తల్లిదండ్రులు మహేశ్ బాబుకు చిన్నారి సమస్య గురించి తెలియజేశారు.

చిన్నారి బాధ్యతను మహేశ్ తన భుజాలపై వేసుకొని ఆంధ్ర హాస్పిటల్ ను చిన్నారికి వైద్యం చేయవాల్సిందిగా కోరాడు, చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చును తానే కడతానని వారిని చికిత్సకు ఒప్పించాడు. పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లకు సూచించారు. 2 వ తేదీన శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆ చిన్నారిని ఆబ్సర్వేషన్ లో పెట్టారు. ఆపరేషన్ అనంతరం పాప పరిస్థితి మరీ దారౌనంగా మారింది, బీపీ పడిపోవటం చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోవడం జరిగాయి. ఐ‌సీ‌యూ కు తరలించి మరింత మెరుగైన చికిత్స అంధించడంతో చిన్నారి రికవర్ అయ్యింది, కాగా రెండువారాల తరువాత చిన్నారి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది, దాంతో చిన్నారిని ఆసుపత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేశారు, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news