కొరటాల శివతో విజయ్.. ఎలాంటి సినిమా చేస్తారో..!

-

స్టార్ సినిమాలతో సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇస్తూ కమర్షియల్ సక్సెస్ అందుకుంటున్న డైరక్టర్ కొరటాల శివ మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోసం కథ సిద్ధం చేస్తున్న కొరటాల శివ డిసెంబర్ నుండి చిరు సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

యువ హీరోల్లో చేసిన ఐదు సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ కొరటాల శివతో సినిమా అంటే ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. కొరటాల శివ విజయ్ కోసం ఇప్పటికే ఓ లైన్ రాసుకున్నాడట. తన రెగ్యులర్ మెసేజ్ ఓరియెంటెడ్ కథలా కాకుండా విజయ్ కోసం అద్భుతమైన కథ అనుకున్నాడట. తప్పకుండా విజయ్ లాంటి హీరో అది చేస్తే అద్భుతాలే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు.

ప్రస్తుతం విజయ్ టాక్సీవాలా రిలీజ్ కు రెడీ అయ్యింది. డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా ఉంది. మొత్తానికి కొరటాలతో విజయ్ సినిమా చేస్తే మరోసారి ఇండస్ట్రీ అంతా షేక్ అవడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news