యోగీ ఫిక్సయితే… బుల్లెట్ దిగాల్సిందే!

-

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆధిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రణాణి స్వీకారం చేసినప్పటి నుంచీ రాష్ట్రంలోని కరడుగట్టిన దొంగలను, గ్యాంగ్ స్టర్లను, రౌడీమూకలను వరుసబెట్టి లేపేస్తున్నారు. అందులో యోగీ ప్రభుత్వం అస్సలు తగ్గట్లేదు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ మధ్య వికాస్ దూబేను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసుల బృందంపై కాల్పులు జరిపి ఏకంగా ఎనిమిది మంది పోలీసులను వికాస్ గ్యాంగ్ పొట్టన పెట్టుకుంది. దాంతో చిర్రెత్తిన పోలీసులకు ఏవిధంగా అయినా వికాస్ దూబేను పట్టుకోవాల్సిందేనంటూ కసితో గాలింపులు చేపట్టారు.

తాజాగా గురువారం రోజు ఉజ్జ‌యినిలో దూబేను అరెస్ట్ చేసిన పోలీసులు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు త‌ర‌లించాలని భావించారు. అయితే అలా తరలిస్తుండ‌గా కాన్పూర్ వద్ద అనుకోని ఘటన జరిగింది. దూబేను త‌ర‌లిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) వాహ‌నం.. ఈరోజు ఉదయం తెల్లవారుజామున కాన్పూర్ స‌మీపంలోని బార్రా ప్రాంతం వద్ద బోల్తా ప‌డంది. ఈరోజు ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. వాహనంలో ఎస్టీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు వికాస్ దూబే కూడా ఉన్నాడు. అయితే ఆ వాహనంలో ఉన్న నలుగురికీ కూడా స్వల్పంగా గాయ‌ప‌డ్డారు. ఆ తర్వాత ఈ ప్ర‌మాదాన్ని ఆసరాగా చేసుకొని వికాస్ దూబే త‌ప్పించుకోవ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. దీంతో పెనుగులాట చోటుచేసుకుంది. తిక్కరేగిన పోలీసులు పారిపోతున్న వికాస్ దూబేను.. ఎన్‌కౌంట‌ర్ ‌లో లేపేశారు!

ఉత్తరప్రదేశ్ లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వికాస్ దూబే… పోలీసులనే కోవర్టులుగా పెట్టుకొని అక్రమాలు, అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తాను చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. ఆతడి అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పోలీసులపై కాల్పులు జరిపిన తర్వాత వికాస్‌ దూబే రాష్ట్రం విడిచి 700 కిలోమీటర్లు పోలీసుల కనుగప్పి కారులో ప్రయాణించి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో తలదాచుకున్నాడు.

మాస్క్ పెట్టుకొని తిరుగుతున్న అతడిని సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందే.. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేలు నగదు బహుమతి ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. అయినప్పటికీ అతడి ఆచూకీ తెలియలేదు. దీంతో రూ. 50 వేల నుంచి 5 లక్షల వరకు రివార్డును పెంచారు. దీంతో ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాలి గుడిలో అతడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్థానిక పోలీసులు వికాస్‌ను అరెస్టు చేశారు.

కాగా అలా తరలిస్తున్న పోలీసులపై తిరగబడి.. పారిపోయేందుకు ప్రయత్నించడంతో దూబేను ఎన్‌కౌంట‌ర్‌లో కాల్చిచంపామ‌ని అధికారులు స్పష్టం చేశారు. త‌న‌ను అరెస్ట్ చేసేందుకు వ‌చ్చిన ఎనిమిది మంది పోలీసుల‌ను దూబే గ్యాంగ్… వారం రోజుల క్రితం అతి దారుణంగా కాల్చిచంపేసింది. ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు.. దూబేను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌త్యేక టీమ్స్‌ను రంగంలోకి దించింది.. దూబే వారం రోజుల పాటు త‌ప్పించుకుని తిర‌గాడు. అత‌డి ముగ్గురు అనుచ‌రుల‌ను ఎన్‌కౌంట‌ర్‌లో చంపేశారు పోలీసులు. ఇక‌.. నిన్న ఓ ప్లాన్ ప్ర‌కారం.. ఉజ్జ‌యినిలో పోలీసుల‌కు వికాస్ దూబే దొరకడంతో ఈరోజు అత‌డి క‌థను ముగించేశారు.

యోగీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఎన్ కౌంటర్లను చేసింది. ఓ రకంగా రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోన్న అక్రమార్కుల దందాను అరికట్టడంలో భాగంగా సర్కార్ పోలీస్ అధికారులకు ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి ఇలా అక్రమార్కులను ఏరిపారవేడయంపై రాష్ట్రప్రజలు శెభాష్ యోగీ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news