తెలంగాణ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి పి.రామస్వామి నిన్న రాత్రి కన్నుమూశారు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన చనిపోయారు. మహారాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు రామస్వామి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పి.రామస్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా నిరాఢంబరమైన జీవితం గడిపిన రామస్వామి, నిజాయితీగా ప్రజలకు సేవలందించి మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరొందారని అన్నారు. రామస్వామి మరణం రాష్ట్రానికి తీరని లోటు లని పేర్కొన్నారు. అలాగే మంత్రి హరీష్ రావు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.