నాగార్జున కామెంట్స్ పై మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తి..!

-

కింగ్ నాగార్జున గూఢచారి సక్సెస్ మీట్ లో చేసిన కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ ను హర్ట్ అయ్యేలా చేశాయి. అదేంటి మహేష్ ఫ్యాన్స్ ను అంతలా హర్ట్ అయ్యే పని నాగ్ ఏం చేశాడు అంటే ఈ ఇయర్ సూపర్ హిట్ లిస్ట్ లో భరత్ అనే నేను సినిమా చేర్చకపోవడమే. అడివి శేష్ లీడ్ రోల్ లో వచ్చిన గూఢచారి మూవీ సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా కలక్షన్స్ చూస్తే అందరు షాక్ అవుతున్నారు.

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో నాగార్జున ఈ ఇయర్ సూపర్ హిట్ సినిమాల్లో రంగస్థలం, మహానటి, గూఢచారి మాత్రమే నిలుస్తాయని అన్నారు. అదేంటి భాగమతి, ఛలో, తొలిప్రేమ, ఆరెక్స్ 100తో పాటుగా మహేష్ భరత్ అనే నేను కూడా హిట్ అందుకుంది. ఈ సినిమాలు నాగార్జున లెక్కలోకి ఎందుకు రాలేదని డౌట్ పడుతున్నారు.

సోగ్గాడే చిన్ని నాయనా టైంలో నాన్నకు ప్రేమతో సక్సెస్ కన్నా తన సినిమా సక్సెస్ ఎక్కువ అన్నట్టు మాట్లాడిన నాగ్ ఈసారి గూఢచారిని పోల్చుతూ భరత్ అనే నేనుని లెక్క చేయలేదు. మరి నాగార్జున కామెంట్స్ లోని ఆంతర్యం ఏంటి అన్నది తెలియదు కాని నాగార్జున కూడా మహేష్ ఫ్యాన్స్ ట్రోలింగ్స్ కు కారకుడయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news