తెలంగాణ వాసికి దుబాయ్ ఆసుపత్రి యాజమాన్యం రూ.1.52 కోట్ల చికిత్స బిల్లును మాఫీ చేసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని వెనుగుమట్లకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి దుబాయ్ లో కరోనా బారిన పడి 80 రోజులు హాస్పిటల్ లోనే ఉన్నాడు. అతడు డిశార్జ్ అయ్యే నాటికి బిల్లు రూ.1.52 కోట్లు అయింది. అది చూసిన వెంటనే అతడికి గుండె ఆగినంత పనైయింది.
తాను ఏదో బతుకు దెరువు కోసం వచ్చి వ్యాధి బారిన పడటంతో మన ఇండియన్ కాన్సులేట్ కు తనను ఆదుకోమని విజ్ఞప్తి చేయడంతో ఇప్పుడు అతడి బిల్లుని ఇండియన్ కాన్సులేట్ ఆసుపత్రిని విజ్ఞప్తి చేయడంతో బిల్లు మొత్తం మాఫీ చేసి అతడు ఇండియాకు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి జేబులో ఒక పది వేళా రూపాయలు పెట్టి ఇండియాకు పంపించారు. దీనితో ఆసుపత్రి వర్గాలు తీసుకున్న నిర్ణయంతో అతడు ఆనందం వ్యక్తం చేశాడు.