మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 8,641 కరోనా కేసులు నమోదవ్వగా, మొత్తం 266 మంది మరణించారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2,84,281కు చేరింది. మొత్తం 11,194 మంది మరణించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 1,58,140 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,14,648 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
The current count of COVID19 patients in the state of Maharashtra is 284281. Today,newly8641 patients have been identified as positive.Also newly 5527 patients have been cured today,totally 158140 patients are cured & discharged from the hospitals Total Active patients are114648.
— Rajesh Tope (@rajeshtope11) July 16, 2020
ఆ రాష్ట్రంలో రికవరీ రేటు 55.63 శాతంగా ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం విడుదల చేసిన తాజా కరోనా కేసుల బులెటిన్‌లో వెల్లడించింది. కాగా ఒక్క ముంబై మహానగరంలోనే కొత్తగా 1476 పాజిటివ్ కేసులు నమోదుకాగా…మొత్తం కేసుల సంఖ్య 97,950కి చేరింది. మొత్తంగా ఇప్పటివరకు 5,523 మంది మరణించారు.