కరోనా అంతం కావాలని ప్రార్థిస్తూ హిమాచల్ ప్రదేశ్‌లో స్థానిక బీజేపీ వుమెన్స్ వింగ్ యాగం నిర్వహించారు. ఈ సందర్బంగా 55లక్షల గాయత్రి మంత్ర జపం చదువుతూ కరోనా అంతం కావాలని కోరారు. అనంతరం సిమ్లాలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జైరాం ఠాకూర్ హాజరయ్యారు. కరోనాకి వ్యాక్సిన్ లేనప్పుడు మెడిసిన్ ద్వారా మాత్రమే వైద్యం అందుతుందని, అలాగే ఇలాంటి మంత్ర జపం చేయడం ద్వారా ఎంతో శక్తిని ఇస్తుందని సీఎం అన్నారు.
Shimla (HP): CM Jairam Thakur participated in ‘Purnahuti’ after 55 lakh ‘Gayatri Mantra Jaap’ organized by State BJP women's wing for end of #COVID19,&world peace. He said,"When no vaccine or medicine is available for the virus,then these things give us strength." (16.07.20) pic.twitter.com/1jGiWNlsQh
— ANI (@ANI) July 16, 2020
కాగా, ఈ మహమ్మారి బారిన ఇప్పటికే ఎంత పడ్డారు. అధికారులు, ప్రజలు, నాయకులు, అగ్ర తారలు ఇలా అందరినీ ఈ మహమ్మారి పలకరించింది. దీని దాటికి ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. భారత్ లో దీని తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల మంది దీని బారిన పడ్డారు.