దేశ చరిత్రలో తొలిసారి.. వైసీపీ మహిళ ఎమ్మెల్యే అరుదైన ఘనత..!

-

కరోనా, చికిత్స విషయంలో నూతన ఆవిష్కరణలపై ఎన్‌ఆర్డీసీ పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో ఏపీ‌ నుంచి రెండు ఆవిష్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. అనంతపురంలోని ఎస్‌ఆర్‌ఐటీ, ఏలూరులోని రామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్ ఈ ఘనత సాధించాయి. ఎస్‌ఆర్‌ఐటీ ఆవిష్కరణ శింగనమల వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రూపొందించినది కావడం విశేషం.

ఓ ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా జొన్న‌లగ‌డ్డ ప‌ద్మావ‌తి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇక ఎంటెక్‌ చదివిన ఎమ్మెల్యే పద్మావతి, క‌రోనా వైద్య చికిత్స అందించే క్ర‌మంలో, వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండే క్యాబిన్‌ రూపొందించారు. దీంతో ప్ర‌స్తుతం జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారారు.

Read more RELATED
Recommended to you

Latest news