ఏపీలో ఇసుక వినియోగదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు ట్రాక్టర్ ఇసుకకు చలానాగా వాసులు చేసిన అన్ని చార్జీలపై రూ.1,300 భారం తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఆదేశాలను జారీ చేసింది.
దీంతో ఇక ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఇసుక కోసం వినియోగదారులు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్ -1లో దరఖాస్తు చేసుకోవాలి. 24 గంటల్లో దీన్ని పరిశీలించి పర్మిట్ సమయం, తేదీలతో ఇస్తారు. రీచ్ నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోనే అనుమతిస్తారు. ఇసుక రవాణా సమయంలో గ్రామ సచివాలయం ఇచ్చిన పర్మిట్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.