కరోనా వైరస్ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారం కొంత మందిని ఆందోళనకు గురి చేస్తుంది. ఊర్లో శవాలను ఖననం చేస్తే భవిష్యత్తులో భూగర్భ జలాలు కలుషితం అయ్యే అవకాశం ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణాలైనా అర్పిస్తాం గాని… మా గ్రామ సమీపంలో ఖననం చేయడానికి కొవిడ్ మృతదేహాలను రానివ్వమని… ఎ.రంగంపేట గ్రామస్తులు అధికారులకు స్పష్టంగా చెప్పేశారు.
ప్రభుత్వ భూముల్లో కూడా శవాలను ఖననం చేయనివడం లేదు. పోలీసుల సాయంతో రెవెన్యూ సిబ్బంది వెళ్ళినా సరే అడ్డంగా కూర్చుని రోడ్డు మీద నిరసన తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పినా సరే వారు లెక్క చేయడం లేదు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామం మాత్రం ఇప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. తాము పశువులను ఇక్కడ మేపుతామని, ఇలా చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు.