య‌మ‌హా FZ బీఎస్‌6 వేరియెంట్లు వ‌చ్చేశాయ్.. ధ‌ర‌లు ఎంతంటే..?

-

టూవీల‌ర్స్ త‌యారీదారు య‌మ‌హా త‌న FZ సిరీస్‌లో రెండు నూత‌న బైక్‌ల‌ను విడుద‌ల చేసింది. 2020 య‌మ‌హా FZ 25, FZS 25 పేరిట బీఎస్‌6 వేరియెంట్ల‌లో కొత్త బైక్‌లు విడుద‌ల‌య్యాయి. ఎఫ్‌జ‌డ్ 25 బీఎస్‌6 వేరియెంట్ ఎక్స్ షోరూం ధ‌ర ఢిల్లీలో రూ.1.52 ల‌క్ష‌లు ఉండ‌గా, ఎఫ్‌జ‌డ్ఎస్ 25 బీఎస్‌6 వేరియెంట్ ధ‌ర రూ.157 ల‌క్ష‌లుగా ఉంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న య‌మ‌హా డీల‌ర్ల వ‌ద్ద ప్ర‌స్తుతం FZ 25 బీఎస్‌6 బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. మ‌రో వేరియెంట్‌.. FZS 25 బైక్‌లు అతి త్వ‌ర‌లోనే వాహ‌న‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి.

2020 yamaha fz 25 bs6 variants launched

రెండు బైక్‌ల‌లోనూ 249సీసీ ఎయిర్‌కూల్డ్‌ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. 20.5 బేసిక్ హార్స్ ప‌వ‌ర్‌ను ఇవి క‌లిగి ఉంటాయి. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో రెండింటికీ మోనోషాక్ అబ్జార్బ‌ర్‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 282 ఎంఎం డిస్క్‌, వెనుక వైపు 220 ఎంఎం డిస్క్‌లు ఉంటాయి. డ్యుయ‌ల్ చాన‌ల్ ఏబీఎస్‌ను అందిస్తున్నారు.

ఈ రెండు బైక్‌లు సుజుకికి చెందిన జిక్స‌ర్ 250, బ‌జాజ్ డామినార్ 250సీసీల‌కు పోటీనిస్తాయ‌ని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news