అధికారంలో ఉన్నంతకాలం పట్టించుకున్న దిక్కు లేకపోయినా.. అధికారం పోయి తత్వం బోధపడేసరికి బాబుకు కార్యకర్తలు బాగా గుర్తుకువస్తున్నారంట.. రోజంతా వారిగురించే ఆలోచిస్తూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారంట. ఎవరికి ఏలాంటి ఇబ్బందులు వచ్చినా.. నేరుగా ఫోన్ చేసేసి మాట్లాడేస్తున్నారంట. అంతేకాదు.. వారికివచ్చిన న్యాయపరమైన సమస్యలకోసం ప్రత్యేకంగా పార్టీ తరుపున లాయర్ లను కూడా ఏర్పాటుచేశారంట.!
అవును… అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కార్యకర్తలను పట్టించుకోలేదనే విమర్శ అత్యంత బలంగా వినిపించింది. దీంతో 2019 ఎన్నికల ఫలితాల అనంతరం కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉంటున్నారు! దీంతో బాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని అంటున్నారు. ఎంత గొప్ప పార్టీకైనా కార్యకర్తలే పునాదులు అన్న విషయంపై జ్ఞాయోదయం అయినట్లు ప్రవర్తిస్తున్నారంట. అందులో భాగంగా… చంద్రబాబు నేరుగా కార్యకర్తలకు ఫోన్ చేసి మాట్లాడేస్తున్నారట.
వైకపా అధికారంలోకి వచ్చినప్పటినుంచీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపిస్తోన్న టీడీపీ… ఆ క్రమంలో టీడీపీ కార్యకర్తలపై ఎక్కడైనా కేసులు నమోదయితే చాలు వెంటనే చంద్రబాబు నుంచి ఫోన్ వెళ్లిపోతుందంట. అంతేకాదు… ప్రతి నియోజకవర్గంలో వీరికోసం ప్రత్యేకంగా ఒక లాయర్ ను నియమించి.. కార్యకర్తలకు బెయిల్ రావడం దగ్గరనుంచి కేసు విచారణ అంతా ఆయనే చూసుకోవాలని.. ఇందుకు అవసరమైన ఖర్చును కూడా పార్టీయే భరిస్తుందని బాబు చెప్పారంట.
దీంతో… ఎప్పుడూ లేనిది కార్యకర్తలపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు బాబు గారు అని అనుకుంటూ… “సార్ మీరు మారిపోయారండి… కార్యకర్తల కష్టం గుర్తించే ఆలోచనలు చేస్తున్నారండీ.. కేడర్ కష్టాలపై ఆలోచించడం ఎప్పటినుంచి మొదలుపెట్టారండీ..” అంటూ తమ్ముళ్లు హ్యాపీ ఫీలవుతున్నారంట!!