వివేకా కుమార్తె చేతిలో పెద్ద బ్యాగ్… అసలు ఏం జరుగుతుంది…!

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను సిబిఐ అధికారులు వేగవంతం చేసారు. 12 వ రోజు వరుసగా విచారణ జరుగుతుంది. నిన్న విచారణకు హాజరైన వైఎస్ కుటుంబానికి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కీలక ప్రశ్నలు వేసారు అధికారులు. ఒక్కోక్కరిని 7 గంటల పాటు విచారిస్తున్న సీబీఐ అధికారులు… పలు కీలక ప్రశ్నలు వేస్తున్నారు. నేడు మరోమారు సిబిఐ అధికారుల విచారణకు వివేకా కుమార్తె సునీత హాజరు అయ్యారు.

ఒక బరువైన బ్యాగుతో సిబిఐ అధికారులు విచారణకు హాజరయ్యారు సునీత. ఆ బ్యాగ్ లో అత్యంత విలువైన డాక్యుమెంట్స్ ఉన్నట్లు సిబిఐ అధికారులు భావిస్తున్నారు. మరి కొందరు కీలక వ్యక్తులను, అనుమానితులను విచారించే అవకాశం ఉంది. వివేకా కుమార్తె… మరోమారు విచారణకు హాజరుకావడం బరువైన బ్యాగుతో వెళ్లడంపై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news