ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకట రమణారావుకు మరో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం జిల్లాల్లో.. త్తరాంధ్ర పరిధిలోని 3 జిల్లాల బాధ్యతలను పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి, మిగిలిన పదింటిలో 5 జిల్లాల చొప్పున బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జులై 1న అప్పగించిన విషయం తెలిసిందే.
ఇది జరిగిన 16 రోజుల తరువాత జులై 17న సజ్జల నుంచి రెండు జిల్లాలు తప్పించారు. వై.వి.కి అప్పగించిన వాటిలో గురువారం రెండు జిల్లాలు తగ్గించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలకూ మూడు జిల్లాల చొప్పున కేటాయించినట్లైంది. మిగిలిన నాలుగింటిలో రెండు జిల్లాలను రాజ్యసభ సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, మరో రెండింటిని మోపిదేవి వెంకటరమణారావుకు అప్పజెప్పారు.