మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడ్డారు. కరోనా పరీక్షలపై సీఎం జగన్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు ఓ ట్వీట్ చేశారు. అందులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా శాంపిల్స్ టెస్టుల జాబితాను పోస్ట్ చేశారు. “పది లక్షల మందికి రోజుకు సగటున కనీసం 140 కరోనా టెస్టులు కూడా చేయడం లేదని అన్నారు. ఏయే రాష్ట్రాల్లో 140 (రోజుకు పది లక్షల మందికి సగటున), అంతకంటే ఎక్కువ కరోనా టెస్టులు చేస్తున్నారో కేంద్రం ప్రకటించిన జాబితాను చంద్రబాబు పోస్ట్ చేశారు.
Andhra Pradesh is not even featuring in the list announced by the Centre regarding states performing more than 140 tests per day per million people. Why is the state missing? Why are people of AP being cheated with fake numbers? pic.twitter.com/sfZJ4VyAC8
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 30, 2020
అందులో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు స్థానం దక్కించుకోలేకపోయింది. ఎందుకు ప్రజలను తప్పుడులెక్కలతో మోసం చేస్తున్నారు.” అని ట్వీట్ లో ప్రశ్నించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కోరలు చాచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 69,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 60,024 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వకు 1281 మంది కరోనాతో కన్నుమూశారు.