రఘురాముడి భక్తిపారవశ్యం… జగన్ కు ఇరకాటం!

-

గతకొన్ని రోజులుగా వరుసపెట్టి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖలు రాస్తున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు! ఈ క్రమంలోనే తాజాగా మరో లేఖ రాశారు. కాకపోతే ఇప్పటివరకూ రాసిన లేఖల్లో రాజకీయాలు నేరుగా కనిపిస్తే… తాజా లేఖలో భక్తిపారవశ్యం చాటున ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశం దాగుందని చెబుతున్నారు విశ్లేషకులు!

వివరాళ్లోకి వెళ్తే… ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఆగష్టు 5న అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమం రోజున రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని లేఖలో కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలని.. ఇదే సందర్భంలో అయోధ్యలో భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ఆద్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు!

ఇది సూచనా.. డిమాండా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే.. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఆర్.ఆర్.అర్. డిమాండ్ ప్రాక్టికల్ గా సాధ్యమా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న! ఒకపక్క ఉన్న సమస్యలతో కొట్టిమిట్టాడుతుంటే… కరోనా వల్ల కొత్త కొత్త సమస్యలు అల్లుకుంటుంటే… ఈ సమయంలో ఆర్.ఆర్.ఆర్. ఇలాంటి డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు.

ఈ సమయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో… జగన్ పై హిందూ వ్యతిరేఖి ముద్ర వేయించాలనేది ఆర్.ఆర్.ఆర్. ప్లాన్ అయ్యి ఉండొచ్చని… ఇదే సమయంలో వైకాపా – బీజేపీ మధ్య ఉన్న సఖ్యతకు బీటలు వారేలా చేయొచ్చని ప్లాన్ చేస్తున్నట్లున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news